
సినిమా ప్రపంచంలో హై టెక్నికల్ వాల్యూస్ తో, మంచి కాన్సెప్ట్ తో తీసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర ఫెయిల్ అవుతాయి. ఇలాంటివి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి పోల్చి చెబుతున్నాడు.
అసలు విషయంలోకి వెళితే చిరంజీవి ఇటీవలే ఓ ప్రచార సభలో మాట్లాడుతూ ‘కొన్నిసార్లు చాలా మంచి సినిమాలు చస్తాం కానీ అవి ఆడవు. అక్కడ అది బాగా లేనందువల్ల ఆడకపోవడం కాదు అప్పటి పరిస్థితుల వల్ల బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ గా నిలిచిపోతుంది. అలా అనిచెప్పి సినిమాలు తీయడం మానేస్తామా? లేదు మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే, ఇప్పుడు మా ముందు కాస్త కష్టతరమైన దారి ఉంది, అలా అని మేము నిరుత్సాహపడటం లేదు, విజయం సాధించాలనే ప్రయత్నిస్తున్నామని’ అన్నాడు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలని చిరంజీవి తీసుకున్నాడు. దానికోసం ఆయన తనవంతు కృషి చేస్తున్నాడు.

