మనం లో ప్రత్యేక పాటను విడుదలచేయనున్న నాగార్జున

మనం లో ప్రత్యేక పాటను విడుదలచేయనున్న నాగార్జున

Published on Apr 24, 2014 10:30 PM IST

Nagarjuna-New-Photos-(18)
అక్కినేని వంశం వారి మల్టీ స్టారర్ మనం సినిమా మే 23న విడుదలకానుంది. ఈ సినిమా ప్రచారానికి నాగార్జున శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర మేకింగ్ వీడియో ని రుచి చూపించిన నాగార్జున టీం మొత్తం ఆనందంగా వున్నట్టు చూపించాడు. ఇప్పుడు నాగార్జున మరో అడుగు ముందుకేయనున్నాడు

రానున్న రెండు రోజులలో సినిమాలో అందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనబడే విధంగా ఒక ప్రత్యేకమైన పాటను విడుదల చేయనున్నట్లు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మరి నాగ్ ఈసారి ఏ మాయ చేస్తాడో చూడాలి

ఈ సినిమాలో శ్రియ, సమంత హీరోయిన్స్. విక్రమ్ కుమార్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు

తాజా వార్తలు