బుల్లితెర పై ‘నారీ నారీ నడుమ మురారి’ !

బుల్లితెర పై ‘నారీ నారీ నడుమ మురారి’ !

Published on Apr 26, 2026 12:05 PM IST

Nari Nari Naduma Murari

శర్వానంద్ సంక్రాంతి బరిలో ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. పైగా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి ఆదరణను పొందింది. ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ఈటీవీలో ప్రసారం కానుంది. మరి బుల్లితెర ప్రేక్షకులను ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తోందో చూడాలి.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ఇద్దరమ్మాయిల మధ్యలో నలిగిపోయే గౌతమ్‌ పాత్రలో కనిపించిన శర్వా.. ప్రేక్షకుల్లో నవ్వులు పూయించారు. సంయుక్తా మేనన్, సాక్షి వైద్య కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రామ్‌ అబ్బరాజు తెరకెక్కించారు. పైగా ఆర్య అనే వ్యక్తిగా శ్రీవిష్ణు అతిథి పాత్రలో అలరించారు. ఇక ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు