
హంసా నందినిని ఎవరైనా ఐటెం గర్ల్ అంటే ఈ భామకు ఎక్కడా లేని కోపం వచ్చేస్తుందట. “ఐటెం గర్ల్స్ అంటూ ప్రత్యేకంగా వుంటారు. నేను హీరోయిన్ గా నటించాను. టాప్ బ్రాండ్స్ కి ప్రచారకర్తను. బాలీవుడ్ లో కత్రినా కైఫ్, దీపికా పదుకునే వంటి వారే ప్రత్యేక గీతాలలో నటిస్తున్నారు. కానీ వాళ్ళని ఎవరూ ఐటెం గర్ల్స్ అనరు. నేను తెలుగులో చేసిన ప్రత్యేక పాటలు తీసుకుంటే అందులో ఎక్కడా శృతి మించదు. ఆ శృతి మించిన్తే నన్ను ఐటెం గర్ల్ అని పిలవండి. నేను గెస్ట్ ఆర్టిస్ట్ ని మాత్రమే” అని ఈ భామ తెలిపింది
రాజమౌళి ఈగలో తళుక్కున మెరిసిన ఈ తారకు తరువాత నుండి ఆఫర్లు వచ్చిపడ్డాయి. మిర్చి, లెజెండ్, భాయ్, అత్తారింటికి దారేది సినిమాలలో హీరోలతో కలిసి చిందులేసింది

