రికార్డులు బద్దలుగొట్టిన ‘మైఖేల్’.. 2000 కోట్లతో మైండ్ బ్లాకింగ్ ఓపెనింగ్స్.. ఒక్క రోజులోనే పెట్టిన బడ్జెట్ వెనక్కి

రికార్డులు బద్దలుగొట్టిన ‘మైఖేల్’.. 2000 కోట్లతో మైండ్ బ్లాకింగ్ ఓపెనింగ్స్.. ఒక్క రోజులోనే పెట్టిన బడ్జెట్ వెనక్కి

Published on Apr 26, 2026 9:18 PM IST

Michael

పాప్ ఇండస్ట్రీలో తిరుగు లేని మహారాజు ఎవరంటే మైఖేల్ జాక్సన్ అనే చెబుతారు అంతా. అందుకే పాప్ రంగంలో కింగ్ ఆఫ్ పాప్ గా పిలవబడే తన జీవిత చరిత్రపై వచ్చిన తాజా చిత్రం ఇప్పుడు సంచలనం సెట్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏప్రిల్ 24న విడుదల అయ్యిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డులు బద్దలుగొట్టినట్టు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మైఖేల్ ప్రపంచ వ్యాప్తంగా 217.4 మిలియన్ డాలర్స్ గ్రాస్ అంటే 2 వేల కోట్లకి పైగా ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకొని దుమ్ము లేపింది. వరల్డ్ సినిమా దగ్గర ఒక బయోపిక్ కి ఇదే అత్యధిక ఓపెనింగ్ అట. దీనితో పాప్ రంగం లోనే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా మైఖేల్ జాక్సన్ కింగ్ అనే అనిపించుకున్నారని చెప్పవచ్చు.

ఇది కేవలం ఆరంభం మాత్రమే కాగా ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. అంతే కాకుండా సినిమాకి 155 మిలియన్ మేర బడ్జెట్ అయితే ఆ మొత్తం కేవలం ఒక్క రోజు లోనే రాబట్టేసింది ఈ చిత్రం. ఇక ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ గా జాఫర్ జాక్సన్ నటించగా ఆంటౌన్ ఫక్వా దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు