
తెలుగు సిని డైరెక్టర్ అసోసియేషన్ తో ప్రకాష్ రాజ్ కొద్ది రోజులుగా తీవ్ర ఘర్షణలో ఉన్న సంగతి తెలిసిందే. వ్యతిరేకంగా ఉన్న అతనిపై నిషేధం విధించే ఆలోచనలో ఉన్నారు.ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా, ఏకపక్షంగా ప్రతీ ఒక్క డైరెక్టర్ కూడా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అయితే కొద్ది మంది నిర్మాతలు మాత్రం ప్రకాష్ రాజ్ కు, డైరెక్టర్ లకు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం లో ఉన్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరు ఈ వ్యవహరం లో బాగా వినపడుతోంది. దిల్ రాజు, పేరు పొందిన మరికొంత మంది నిర్మాతలు బహుముఖ నటుడు అయిన ప్రకాష్ రాజ్ పై బాగానే ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏమాత్రం దిగులు పడవద్దని కొంతమంది నిర్మాతలు ప్రకాష్ రాజ్ కు సలహాలు ఇస్తున్నారు.మరి ఈ వ్యవహారం ఎంతవరకు పోతుందో వేచిచూడాలి.

