లాంచ్ అయిన రారా కృష్ణయ్య మోషన్ పోస్టర్

లాంచ్ అయిన రారా కృష్ణయ్య మోషన్ పోస్టర్

Published on May 4, 2014 11:53 AM IST

Ra Ra Krishnayya
సందీప్ కిషన్, రెజీనా కసాండ్ర జంటగా నటించిన ‘రారా కృష్ణయ్య’ సినిమా ఫస్ట్ లుక్ ని నిన్ననే లాంచ్ చేసారు. అలాగే ఈ సినిమాకి సంబందించిన మోషన్ పోస్టర్ ని ఈ రోజు ఉదయం రిలీజ్ చేసారు. ‘లెజెండ్’ తో మళ్ళీ క్రేజ్ తెచ్చుకున్న జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి పి. మహేష్ బాబు డైరెక్టర్. కృష్ణ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి అచ్చు సంగీతం అందించాడు.

ఇటీవలే ఈ సినిమాలోని పాటలను వైజాగ్ లో షూట్ చేసారు. దాంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. సందీప్ కిషన్ మొట్ట మొదటి సారి మాస్ రోల్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

ప్రస్తుతం సందీప్ కిషన్ ఈ సినిమా కాకుండా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇందులో ప్రియా బెనర్జీ, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజా వార్తలు