పునర్జన్మ కోణం లో సాగనున్న మనం!

పునర్జన్మ కోణం లో సాగనున్న మనం!

Published on May 5, 2014 2:00 PM IST

Manam
మనం చిత్రం కధాంశం గురించి మొదటి సారి నాగార్జున స్పష్టం చేశారు. ఏఎన్నార్, నాగచైతన్య, సమంతా, శ్రేయా లు ప్రధాన పాత్రలు గా రాబోతున్న ఈ చిత్రానికి విక్రం కుమార్ డైరెక్టర్ గా వ్యవహరించగా, అక్కినేని కుటుంబం ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్ర ట్రైలర్ ను మొదటి సారి విడుదల చేసినప్పుడు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లతో ఈ చిత్ర కధాంశం గురించి ఎంతో ఆత్రుత నెలకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి కథాంశం నాగార్జున గురించి వివరించారు. ఈ చిత్రం 1920 నుంచి 2030 మధ్య వంద సంవత్సరాలలో జరిగిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ చిత్ర కథాంశం ఎంతో వినోద బరితంగా ఉంటుందని తెలిపారు. పునర్జన్మ కోణం లో ఈ చిత్రం ఉంటుందని నాగార్జున అన్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు