‘గాయపడ్డ సింహం’కి ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా ?

‘గాయపడ్డ సింహం’కి ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా ?

Published on Apr 26, 2026 9:00 AM IST

Gaayapadda-Simham-1

తరుణ్ భాస్కర్ హీరోగా దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం’. ఇప్పటికే, రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఐతే, ఈ సినిమాలో ఓ స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంద‌ని టీమ్ ముందు నుంచీ చెబుతూనే వ‌చ్చింది. మొత్తానికి ట్రైల‌ర్ లో ఆ స‌ర్‌ప్రైజ్ శ్రీ‌విష్ణు కామియో అని క్లారిటీ వచ్చింది. అన్నట్టు శ్రీ‌విష్ణు కామియో చేసిన ‘నారీ నారీ న‌డుమ మురారి’ మంచి హిట్ట‌య్యింది. మరి ఆ సెంటిమెంట్ ఈ సినిమాకీ క‌లిసి వస్తోందా ? చూడాలి.

అన్నట్టు శ్రీ‌విష్ణుది కేవ‌లం కామియో కాదు.. ఎక్స్టేన్ష‌న్ కామియో. పైగా ఈ పాత్ర చుట్టూ పెద్ద క‌థే ఉంది. అదేమిటో సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. అలాగే, శ్రీ‌విష్ణుతో పాటు మరో గెస్ట్ రోల్ కూడా ఈ సినిమాలో ఉంటుందట. మరి ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి. ఇక కళ్యాణ్ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప మరియు ఇతరులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజా వార్తలు