
ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయనున్న రజినీ కాంత్ ‘విక్రమసింహా’ పైనే అందరి చూపు ఉంది. మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమాకి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలను మీకందిస్తున్నాం..
రజినీ కుమార్తె సౌందర్య రజినీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆమె తన టెక్నికల్ స్టాండర్డ్స్ ని మెచ్చి ఇండియన్ అఫ్ ది ఇయర్ అవార్డుని ఇటీవలే అందుకున్నారు.
కొచ్చాడియాన్ సినిమా మే 9న తెలుగు, తమిళ్, హిందీ, భోజ్ పురీ అని మొత్తం 6 భాషల్లో రిలీజ్ కానుంది. రజినీకి జపాన్ లో ఉన్న ఫాలోయింగ్ వాళ్ళ ఈ సినిమాని జపనీస్ మరియు స్పానిష్ లలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే రజినీకాంత్ సరసన ఆఫర్ అనగానే కథ కూడా వినకుండా ఈ సినిమాకి సైన్ చేసింది. అలాగే ఈ సినిమా కోసం తను షూటింగ్ చేసింది రెండు రోజులే అయినా దాదాపు 3 కోట్ల రెమ్యూనరేషన్ అందుకొంది.
మొట్ట మొదటి సారిగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రజినీకాంత్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయిన ట్విట్టర్ లోకి అడుగుపెట్టాడు.
అలాగే ఈ సినిమాలో స్వర్గీయ తమిళ్ కమెడియన్ నగేష్ ని గ్రాఫిక్స్ లో రీ క్రియేట్ చేసి మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీతో మనముందుకు తీసుకురానున్నారు.

