
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ ని ఎంతగానో అభిమానించే అభిమానులు ఇప్పుడు ఒక్కసారిగా నిరుత్సాహపడ్డారు. దానికి కారణం రజినీ ‘కొచ్చాడియాన్’ మరోసారి వాయిదాపడడమే..
ఈ సినిమా వాయిదా పడటం ఇది రెండవసారి. దాంతో అభిమానులు మర్రింత నిరుత్సాహానికి గురయ్యారు. అలాగే ఇండియాలోని కొన్ని మల్టీ ప్లెక్సుల్లో ఈ సినిమా కోసం టికెట్స్ కూడా అమ్మేసారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేయడంతో అందరూ కాస్త ఇబ్బంది పడుతున్నారు.
సౌందర్య రజినీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 23న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

