ప్రతి సినిమాలోనో ఏదో ఒక కొత్తదనాన్ని ట్రై చెయ్యడంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుంటాడు. ప్రతి సినిమాలో తన హెయిర్ స్టైల్ లేదా బాడీ లాంగ్వేజ్ లేదా కాస్ట్యూమ్స్ ఇలా ఏదో ఒక విషయంలో కొత్తదనం చూపిస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు అల్లు అర్జున్ తన రాబోయే సినిమాలో సరికొత్త ఫైటింగ్ స్టైల్ ని చూపించడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఈ యాక్షన్ సీక్వెన్స్ లపై స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలాగే ఈ సరికొత్త యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి బిగ్ హైలైట్ అవుతాయని అంటున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవలే తండ్రైన అల్లు అర్జున్ ప్రస్తుతం తన బాబుతో కొంత సమయం గడుపుతున్నాడు.


