టాలీవుడ్ మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ రీసెంట్ గానే సినీ ఇండస్ట్రీలో 26 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన నుంచి రాబోతున్న కొత్త సినిమానే స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్. విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది.
అక్కడ నుంచి పూరి మార్క్ జెట్ స్పీడ్ లో షూటింగ్ కూడా పూర్తి చేసేసారు. కానీ ఇప్పుడు అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది అర్ధం కాని పరిస్థితిలో ఉంది. అన్ని పనులు అయ్యాయి. ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. కానీ ఎప్పుడో అనౌన్స్ చేసిన టీజర్/గ్లింప్స్ లు మాత్రం ఇంకా బయటకి రాలేదు.
అసలు పూరీ సినిమా అంటేనే ఎప్పుడో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి దాన్ని ఆన్ టైం తీసుకొచ్చి చూపించడం. అలాంటిది ఈ సినిమాకి మాత్రం అవన్నీ మిస్ అవుతున్నాయి. దీనితో స్లమ్ డాగ్ సినిమా పరిస్థితి ఏంటి అని అభిమానులే ఆందోళనలో ఉన్నారు. సో వీటిపై టీం ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.


