త్వరలో అజిత్ మూవీ సెట్లో సందడి చేయనున్న త్రిష

త్వరలో అజిత్ మూవీ సెట్లో సందడి చేయనున్న త్రిష

Published on May 11, 2014 8:26 PM IST

Trisha
అందాల భామ త్రిష చాలా కాలం నుంచి తెలుగులో హీరోయిన్ గా కనిపించడం లేదు. త్రిష చివరిగా తెలుగులో చేసిన ‘దమ్ము’ సినిమా 2012లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తెలుగులో సినిమా చేయలేదు. ఎంఎస్ రాజు డైరెక్షన్ లో రమ్ అనే సినిమా స్టార్ట్ చేసినప్పటికీ అది మధ్యలోనే ఆగిపోయింది.

తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమా కోసం త్రిష ని ఎంపిక చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే అనుష్క హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో త్రిష కూడా ఓ కీలక పాత్రలో నటించనుంది. అజిత్, గౌతం మీనన్ లతో త్రిషకి మంచి రిలేషన్ ఉండడం వల్ల ఈ సినిమాకి త్రిష సైన్ చేసింది. మే 14 నుంచి మొదలయ్యే షెడ్యూల్ నుంచి త్రిష కూడా షూటింగ్ లో పాల్గొననుంది. హారీష్ జైరాజ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు