
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కొచ్చాడియాన్’ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉండగానే రజినీ తన తదుపరి సినిమా ‘లింగా’ని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయాడు. అంతే కాకుండా తాజా సమాచారం ప్రకారం మైసూర్ లో మొదలైన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని రజినీ పూర్తి చేసాడు.
కెఎస్ రవికుమార్ దర్శకకత్వం వహించిన ఈ సినిమాలో మొదటిసారి రజినీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాలా ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చెయ్యాలనే పనిలో ఉన్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ త్వరలో మరో కొత్త ప్లేస్ లో మొదలు కానుంది.

