మరోసారి పూరి డైరెక్షన్ లో రానా.?

మరోసారి పూరి డైరెక్షన్ లో రానా.?

Published on May 12, 2014 10:42 PM IST

Rana_puri
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు నిజమైతే యంగ్ హీరో రానా దగ్గుబాటి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండే అవకాశం ఉన్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడు.

గతంలో రానా – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ‘నేను నా రాక్షసి’ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అలాగే పూరి – రానా కాంబినేషన్ న్యూ మూవీ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం రానా టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలైన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తున్నాడు. అలాగే త్వరలోనే మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కూడా నటించనున్నాడు.

తాజా వార్తలు