విడుదలైన శంకర ఆడియో

విడుదలైన శంకర ఆడియో

Published on May 14, 2014 11:36 PM IST

Shankara (15)

నారా రోహిత్, రెజినా నటించిన శంకర ఆడియో ఈరోజు హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో విడుదలైంది. తాతినేని సత్య దర్శకుడు. శ్రీ లీలా బ్యానర్ పై ఆర్.వి చంద్రమౌళి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కె,ఎస్ రామారావు సమర్పకుడు. మౌన గురు అనే తమిళ సినిమాకు ఇది రిమేక్

ఈ సినిమా గురించి హీరో మాట్లాడుతూ “కొత్త కొత్త కధలను ఎంపిక చేసుకోవడం నాకు ఇష్టం.. ప్రతినిధి సినిమా ప్రజలకు కనేక్త్ట్ అయ్యింది.ఈ సినిమా కూడా అలానే నచ్చుతుందని ఆశిస్తున్నా. కధ వినగానే నచ్చింది. దర్శకుడిలో మంచి ప్రతిభ వుంది”. నాని, తేజ వంటి ప్రముఖులు అతిధులుగా హాజరయ్యారు

సాయి కార్తిక్ సంగీతదర్శకుడు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది

తాజా వార్తలు