
బాలీవుడ్ లో పూర్తి స్థాయి పాత్ర పోషించి రానా దగ్గుబాటి దాదాపు రెండేళ్ళు కావస్తుంది. ఈ మధ్య రణబీర్, దీపికా నటించిన యే జవాని యే దివానీ సినిమాలో మెరిసాడు. అంతకముందు డిపార్ట్మెంట్ సినిమా అతని చివరి సినిమా గా చెప్పుకోవచ్చు
కానీ రానాకి బాలీవుడ్ పై ఇంకా ప్రేమతగ్గలేదట. ముంబైలో నివసించకపోతే అక్కడి సినిమావాళ్ళకు మనం గుర్తుండం. నాకు బాలీవుడ్ లో మంచి స్వాగతం లభించింది. తిరిగి అక్కడకు వెళ్ళే ఆలోచనలు వున్నాయి అని తెలిపాడు. ప్రస్తుతం రానా డేట్ లు తెలుగు సినిమాలకు ఇచ్చేసాడు
ఇప్పుడు రానా చేతిలో రుద్రమదేవి, బాహుబలి సినిమాలు వున్నాయి. అంతేకాక పూరి తీయనున్న సినిమాలో రానా నటిస్తున్నాడు అని పుకార్ల పరంపర కొనసాగుతుంది

