
ఏఎల్ విజయ్ అనే తమిళ దర్శకుడితో అమలాపాల్ వివాహం చేసుకోనుంది అని తెలుపగానే ఈ వివాహం తరువాత ఆమె కెరీర్ పై అప్పుడే ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక వర్గం వారు ఏకంగా ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అని రాసుకొచ్చారు
కానీ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో అమల తాను సినిమాలలో నటిస్తానని ఖరాకండిగా చెప్పుకొచ్చింది. ఎటువంటి పరిస్థితులలో సినిమానుండి బయటకు వెళ్లనని చెప్పింది. ఇటీవలే వస్తా నీ వెనుక సినిమాలో ఈ భామను తొలగించారు. [ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు చిత్రాలు లేవు
చిన్న విషయాలకే భయపడే యువతి పాత్రలో మిళి అనే మళయాళ సినిమా షూటింగ్ లో బిజీగా వుందని సమాచారం

