
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘పవర్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయడమే కాకుండా జూలై లేదా ఆగష్టు లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రవితేజ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘బలుపు’ సినిమాకి రైటర్ గా పనిచేసిన బాబీ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో కనిపించనున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

