యాక్సిడెంట్ కి గురైన నాజర్ కొడుకు ఫైజల్

యాక్సిడెంట్ కి గురైన నాజర్ కొడుకు ఫైజల్

Published on May 22, 2014 1:18 PM IST

nasar-son
సౌత్ ఇండియాలో మరియు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన నటుడు నాజర్. నాజర్ పెద్ద కొడుకు అయిన ఫైజల్ ఈ రోజు ఉదయం యాక్సిడెంట్ కి గురయ్యాడు. ప్రస్తుతం అతను కీలంబాక్కం లోని చెట్టినాడ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

అసలు విషయంలోకి వెళితే.. నాజర్ కుమారుడు ఫైజల్ మరో నలుగురు కారులో ప్రయాణిస్తున్నారు. మహాబలిపురం దగ్గరలోని మనమై గ్రామంలో అనుకోకుండా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో వారి కారు నుజ్జు నుజ్జైంది. అలాగే ఈ కారులో ఉన్న ఐదు మందిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా మరోకతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఫైజల్ ని ఎంఆర్ఐ స్కాన్ కోసం డాక్టర్స్ తీసుకెళ్ళారు. ఫైజల్ పరిస్తి కూడా కాస్త క్రిటికల్ గానే ఉంది.

ఇప్పటికే నాజర్ అతని సతీమణి కమీల హాస్పిటల్ కి చేరుకున్నారు. నాజర్ కుమారుడు ఫైజల్ కి ఏమీ కాకూడదని, తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం..

తాజా వార్తలు