
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మల్లికార్జున్ దర్శకత్వంలో ‘షేర్’ అనే సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అధికారికంగా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన 2012 లో మిస్ ఇండియాగా ఎన్నికైన వన్య మిశ్రాని సెలెక్ట్ చేసారు. చండీఘర్ కి చెందిన ఈ భామ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎంతో మందిని ఆడిషన్స్ చేసిన తర్వాత వన్య మిశ్రాని హీరోయిన్ గా సెలెక్ట్ చేసామని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా సెట్స్ అపికి వెళ్లనుంది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఇది కాకుండా ‘పటాస్’ అనే సినిమాని కూడా ప్రారంభించాడు. కళ్యాణ్ రామ్ స్వీయ నిర్మాణంలో నిమిన్చానున్న ఈ సినిమా ద్వారా అనిల్ రవిపూడి డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.

