రజినీ ‘కొచ్చాడియాన్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ 42 కోట్లు

రజినీ ‘కొచ్చాడియాన్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ 42 కోట్లు

Published on May 26, 2014 1:48 PM IST

kochadiyan
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా భారతదేశంలో మొట్ట మొదటి సారిగా ఫోటోరియలిస్టిక్ కాప్చ్యూర్ టెక్నాలజీతో తెరకెక్కిన సినిమా ‘కొచ్చాడియాన్’. ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకి విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. 6 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3000 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం వీకెండ్ 42 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ఇండియాలో ఇండియా మొత్తమీద 30 కోట్లు కలెక్ట్ చేయగా, ఓవర్సీస్ లో 12 కోట్లు కలెక్ట్ చేసింది. కొచ్చాడియాన్ రజినీకాంత్ చేసే రెగ్యులర్ మూవీ కాకపోయినాసరే బాక్స్ ఆఫీసు వద్ద తన స్టామినా ఏంటనేది ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ కలెక్షన్స్ చూసిన ట్రేడ్ పండితులు మొదటి వారంలో 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.

రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కెఎస్ రవికుమార్ కథ – స్క్రీన్ ప్లే అందించాడు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా తెలుగులో ‘విక్రమసింహా’ గా విడుదలైంది.

తాజా వార్తలు