
ఎంతోకాలం గా ఎదురుచూస్తున్న మహేష్ బాబు ‘ఆగడు’ టిజర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ రోజు విడుదల చేసారు. అనుకున్నట్టుగానే పోలీస్ అధికారి పాత్రలో మహేష్ బాబు డాషింగ్ గా కనిపించారు.
శ్రీనువైట్ల మహేష్ బాబు క్యారెక్టర్ తో మంచి కామెడీ చేయించడంతో పాటు సెటైరికల్ డైలాగులు కూడా చెప్పించారు. ‘ఆగడు’ లో శ్రీను వైట్ల స్టైల్ లో ఒక మంచి కమర్షియల్ కధ వుందని తెలుస్తుంది.
మహేష్ పలికిన కొన్ని పంచ్ డైలాగులుని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. థమన్ తన తరహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించి చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఈ చిత్రం మహేష్ కి ఇంకో బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆశిద్దాం.

