Drishyam 3: మోహన్‌లాల్ సినిమాపై రూ.100 కోట్ల భారీ ఇన్వెస్ట్‌మెంట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Drishyam 3: మోహన్‌లాల్ సినిమాపై రూ.100 కోట్ల భారీ ఇన్వెస్ట్‌మెంట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Published on Apr 24, 2026 2:01 PM IST

సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే ప్రేక్షకులకు ‘దృశ్యం’ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్‌లాల్ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సిరీస్‌లో ముచ్చటగా మూడో భాగం రాబోతోంది. ‘దృశ్యం 3’కి సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వస్తుండగా, ఎట్టకేలకు అధికారిక ప్రకటనతో ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.

ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో దానికి జరిగిన బిజినెస్ డీల్ చూస్తేనే మనకు అర్థమవుతోంది. మలయాళ సినిమా మార్కెట్ స్థాయిని అమాంతం పెంచుతూ, ఈ చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఏకంగా రూ. 100 కోట్ల పెట్టుబడి పెడుతోంది. పనోరమా స్టూడియోస్ ద్వారా ఆశీర్వాద్ సినిమాస్‌లో ఈ భారీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఒక మలయాళ సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించడం, విడుదలకు ముందే ఇంత పెద్ద మొత్తంలో డీల్ క్లోజ్ కావడం ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దర్శకుడు జీతూ జోసెఫ్ మరోసారి తన మార్క్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి రెండు భాగాలు దేశవ్యాప్తంగా పలు భాషల్లో రీమేక్ అయ్యి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఈ మూడో భాగంపై మలయాళంలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. అన్ని కార్యక్రమాలు పక్కాగా ప్లాన్ చేసి 2026 మే 21న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. అసలు ఈసారి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్‌కుట్టి ఎలాంటి మైండ్ గేమ్ ఆడుతాడన్నది బిగ్ స్క్రీన్‌పైనే చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు