
జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి త్వరలో టాలీవుడ్ లో తెరంగేట్రం చేయనున్నాడు. తాజా సమాచారం ప్రకారం, వెంకటేష్ పవన్ కళ్యాణ్ లు కైలిసి నటిస్తున్న హింది రీమేక్ ‘ఓ మై గాడ్’ సినిమాలో మిథున్ చక్రవర్తి కూడా నటిస్తున్నారని సమాచారం.
ఆసక్తికర విషయం ఏంటి అంటే, హింది ‘ఓ మై గాడ్’లో అయన ఒక ముఖ్య పాత్ర పోషించారు. అయితే తెలుగులో మాత్రం అయన ఏ పాత్ర పోషిస్థారు అనేది ఇంకా తెలియరాలేదు. శరత్ మరార్ మరియు సురేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీయ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అందించగా, అనూప్ రుబెన్స్ సంగీతం సమకూరుస్తున్నాడు.
‘తడాకా’ సినిమాను డైరెక్ట్ చేసిన డాలీ, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్ద పెద్ద నటులతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.

