కోర్ట్ అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ జంట హర్ష రోహన్ అలాగే శ్రీదేవి ఆపళ్ళ కాంబినేషన్ లో దర్శకుడు సతీష్ జివ్వాజి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే “బ్యాండ్ మేళం”. థియేటర్స్ లో రిలీజ్ కి ముందు మంచి ప్రమోషన్స్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో మాత్రం అనుకున్న స్థాయిలో రన్ కాలేదు.
ఇక ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ 5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో నేటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఎవరైనా ఉంటే ఇప్పుడు చూడాలి అనుకుంటే ఇప్పుడు ఇందులో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాకి బేబీ, సప్తగిరి ఎక్స్ ప్రెస్ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా ప్రముఖ రచయితా నిర్మాత కోనా వెంకట్ నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


