ప్రస్తుతం ‘రుద్రమ దేవి’ ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రాలు చేస్తూ రానా చాలా బిజీగా వున్నాడు. ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలలో నటిస్తున్న రానా మంచి ఫలితం రాబట్టడం కోసం ఎంతో కృషి చేస్తున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి తో కలసి పనిచేస్తున్న రానా ఇటీవల ఇచ్చిన ఒక కాన్డిడ్ ఇంటర్వ్యూలో ఆయన గురించి ఎన్నో ఆశక్తికరమైన విషయాలు తెలిపారు.
“రాజమౌళి గారు తనకి కావాల్సిన వాటి పట్ల ఎంతో క్లారిటీ తో వుంటారు. అంతేకాకుండా ఆయన ఒక గొప్ప నటుడు ప్రతీ సన్నివేశాన్ని మాకు నటించి చూపిస్తారు దానివల్ల ఆయనకు ఏమి కావాలో మాకు స్పష్టంగా తెలుస్తుంది. పని ఈజీ అవుతుంది” అని రానా అన్నారు.
గతంలో కూడా కొంతమంది దర్శకులు తమ నటన నైపుణ్యాని ప్రదర్శించారు. ‘ఠాగూర్’ లో నటించి వినాయక్ ప్రశంసలు పొందాడు.


