
రామ్, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న సినిమా ‘పండగ చేసుకో’. ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచి కామెడీతో పాటు, మంచి పాటలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇటివలే ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 నుండి మొదలవబోతుంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పరుచూరి కీరీటి నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డిస్కషన్స్ ఈ మధ్యే చెన్నైలో జరిగాయి.

