మణిరత్నం సినిమా లైన్ లో ఉంది – మహేష్ బాబు

మణిరత్నం సినిమా లైన్ లో ఉంది – మహేష్ బాబు

Published on Jun 5, 2014 6:10 PM IST

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘ఆగడు’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు కొరటాల శివతో చేయనున్న సినిమా జూలైలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా ఉంటుందని మహేష్ బాబు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖరారు చేసారు.

ఇవి కాకుండా మహేష్ బాబు – నాగార్జున హీరోలుగా మణిరత్నం దర్శకత్వంలో చేయాలనుకున్న మల్టీ స్టారర్ మూవీ కాన్సల్ అయిపోయిందని వస్తున్న వార్తలపై కూడా మహేష్ బాబు కామెంట్ చేసాడు. ‘మణిరత్నంతో చేయాలనుకున్న సినిమా ఆగిపోలేదు. నేను పలు సినిమాలతో బిజీ గా ఉండడం వల్ల నా డేట్స్ కుదరలేదు. ఈ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అది రాగానే అధికారిక ప్రకటన చేస్తారని’ మహేష్ బాబు అన్నాడు.

ఇన్ని రోజులు అసలు ఈ సినిమా లేదని వస్తున్న వార్తలకి మహేష్ బాబు చెప్పిన మాటలతో తెరపడింది. ప్రస్తుతం మహేష్ బాబుకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల నాగార్జున – మహేష్ బాబు – మణిరత్నం మూవీ 2015లో ఉండే అవకాశం ఉంది.

తాజా వార్తలు