టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గతకొన్నాళ్లుగా నెలకొన్న సైలెన్స్‌ను రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి దూరం చేస్తున్నాడు. సరైన భారీ సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సమయంలో, అడివి శేష్ ‘డెకాయిట్’ కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. పక్కా ప్లానింగ్, ప్రమోషన్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి థియేటర్లకు ఊపిరి పోసింది. అయితే అది ముగిసే సమయానికి మళ్ళీ డెడ్ డ్రై సిచువేషన్ వస్తుందనుకుంటున్న తరుణంలో ‘డార్లింగ్’ రీ-రిలీజ్ రూపంలో బాక్సాఫీస్‌కు గట్టి ఆక్సిజన్ దొరికింది.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.3 కోట్లకు పైగా వసూలు చేయడం ప్రభాస్ స్టామినాకు నిదర్శనం. ప్రస్తుతం మెయిన్ సెంటర్స్ అన్నీ హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా వింటేజ్ ప్రభాస్ మ్యాజిక్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కరుణాకరన్ మార్క్ క్లాసిక్ లవ్ స్టోరీకి, మాస్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పట్టడం విశేషం.
ఈ వీకెండ్ వరకు ‘డార్లింగ్’ హవానే కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘రాజా సాబ్’ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ ‘డార్లింగ్’తో మరోసారి తన క్రేజ్ చూపిస్తున్నాడు.


