టాక్ షోలో బాగా ఎమోషనల్ అయిన రమ్యకృష్ణ

టాక్ షోలో బాగా ఎమోషనల్ అయిన రమ్యకృష్ణ

Published on Jun 8, 2014 8:37 PM IST

Ramya-Krishna
ఇప్పటికీ వన్నె తగ్గని టాలీవుడ్ అందాల భామ రమ్యకృష్ణ ఓ రియాలిటీ టాక్ షోలో బాగా ఎమోషనల్ అయిపొయింది. అది ఎవరి టాక్ షోలోనో కాదు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేస్తున్న ‘సౌందర్య లహరి’ టాక్ షోలో కావడం విశేషం.

ప్రస్తుతం రాఘవేంద్ర రావుతో తనకున్న అనుబంధాన్ని గురించి చెబుతూ రమ్యకృష్ణ ఎమోషనల్ అయిన ప్రోమోస్ ని ప్రచారం చేస్తున్నారు. ‘నేను హీరోయిన్ ఎంత సాధించినా దానికి కారణం రాఘవేంద్ర రావు గారే. నాకు గుర్తింపును మరియు స్టార్డం ని తెప్పించిన డైరెక్టర్ ఆయన. ఆయనకీ నేను ఎప్పటికీ ఋణపడి ఉంటానని’ రమ్యకృష్ణ ఈ షోలో బాగా ఎమోషనల్ అయ్యింది.

రమ్యకృష్ణ 1990లో ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగొంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.

తాజా వార్తలు