
సందీప్, సిద్దార్థ్ వర్మ, రవి, హరీష్, అంజన, విష్ణు ప్రియ, ప్రవీణ, హారిక, సూర్య, మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేను నా ఫ్రెండ్స్’. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూన్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రకరకాల ధ్యేయాలు ఉన్న కొంత మంది ఫ్రెండ్స్ తమ జీవితాల్లో ఏమేమి సాధించారు అనే కథాంశంతో ఈ సినిమాని నిర్మించారు.
జిఎస్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని సాయి మేధా రమణ – వోరుగంటి మధుసూదన్ కలిసి ఈ సినిమాని నిర్మించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి చిన్ని చరణ్ మ్యూజిక్ అందించాడు.

