ఆగిపోయిన హవీష్ ‘వస్తా నీ వెనుక’

ఆగిపోయిన హవీష్ ‘వస్తా నీ వెనుక’

Published on Jun 10, 2014 10:00 AM IST

Vastha-Nee-Venuka
‘జీనియస్’ ఫేం హవీష్ కథానాయకుడిగా, రమేష వర్మ దర్శకత్వంలో ‘వస్తా నీ వెనుక’ అనే సినిమా మొదలైంది. ఈ సినిమాలో అమలా పాల్ ఒక హీరోయిన్ గా నటించాలి. ఎప్పుడైతే అమలా పాల్ తన వెడ్డింగ్ ప్లాన్స్ గురించి చెప్పిందో అప్పటి నుంచి ఈ చిత్ర టీం ఆమెని ఇబ్బంది పెట్టడం ఇబ్బంది లేక ఈ చిత్రాన్ని ఆపేశారు. అమలా పాల్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంది.

ఆ తర్వాత అమలా పాల్ ప్లేస్ లో కేథరిన్ ను ఎనుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కేథరిన్ మాత్రం ఈ సినిమా షెడ్యూల్ కి డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉందని సమాచారం. గ్లామర్ తో పాటు నటనకి ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో మేకర్స్ మరో హీరోయిన్ ని ఆమె ప్లేస్ లో రీ ప్లేస్ చేయలేకున్నారు. అందుకే ఈ సినిమాను ప్రస్తుతానికి ఆపేశారు.

తాజా వార్తలు