
గత కొద్ది రోజుల క్రితం కంగన రనౌత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘క్వీన్’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని తెలుగులో, అలాగే సౌత్ లాంగ్వేజస్ లో రీమేక్ చేయనున్నారని మేము ఇది వరకే తెలిపాము. ఈ రీమేక్ రైట్స్ ఎవరు తీసుకున్నారు అనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
ఫేమస్ తమిళ నటుడు, డైరెక్టర్ అయిన త్యాగరాజన్ వయోకాం 18 నుంచి సౌత్ లాంగ్వేజస్ అయిన తెలుగు, తమిళ, మళయాళ హక్కులను సొంతం చేసుకున్నాడు. ‘జీన్స్’ సినిమాతో తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న హీరో ప్రశాంత్ నాన్నగారే త్యాగరాజన్.
ప్రస్తుతాని రీమేక్ రైట్స్ విషయం మాత్రమే ఫైనలైజ్ అయ్యింది. కానీ ఈ మొద్దు భాషల్లో కంగన రానౌత్ పోషించిన పాత్రని ఎవరు చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

