
ఒకే ఫ్యామిలీ, ముగ్గురు హీరోలు, వీళ్ళంతా కలిసి ఒకే సారి తెరపై కనపడితే అభిమానుల ఆనందానికి అవధులే ఉండవు. అలా అక్కినేని ఫ్యామిలీ ముగ్గురు హీరోలు కలిసి చేసిన సినిమా ‘మనం’. మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా విడుదలై ఇది నాలుగోవారం కానీ కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు.
మేము నిన్నటి వరకూ ఇండియా మొత్తంగా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ రిపోర్ట్ ని మీకందిస్తున్నాం. నిన్నటి వరకూ ఈ సినిమా ఓవరాల్ గా 23. కోట్ల షేర్ సంపాదించింది. ఏరియాల వారీ గా కలెక్షన్ వివరాలు..
| ఏరియా | కలెక్షన్ |
| నైజాం | 8.97 కోట్లు |
| సీడెడ్ | 3.33 కోట్లు |
| వైజాగ్ | 2.66 కోట్లు |
| గుంటూరు | 1.75 కోట్లు |
| కృష్ణా | 1.64 కోట్లు |
| నెల్లూరు | 73 లక్షలు |
| పశ్చిమ గోదావరి | 1.21 కోట్లు |
| తూర్పు గోదావరి | 1.58 కోట్లు |
| కర్ణాటక | 1.70 కోట్లు |
| తమిళ నాడు & కేరళ | 35 లక్షలు |
| నార్త్ ఇండియా | 4 లక్షలు |
| ఇండియా మొత్తం షేర్ | 23.98 కోట్లు |

