
అక్కినేని నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు మొదటి సీజన్ ప్రారంభమయ్యి నాలుగు ఎపిసోడ్ లను పూర్తిచేసుకుంది. ఈ షో అనతికాలంలోనే బాగా పాపులర్ అవ్వడమే కాకుండా పెద్ద హిట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల కళ్ళను టి.వి ముందు కట్టిపడేస్తుంది
ఈ షోని భారీ వ్యయంతో మా టి.వి సంస్థ నిర్వహిస్తూ ఎంతో ధైర్యం చేసింది. ఈ కార్యక్రమంలో నాగార్జున మాటకారితనానికి ఆయన సహజసిద్ధమైన స్వచ్చమైన మనస్తత్వానికి ప్రశంసలు అందుతూ షో సూపర్ హిట్ అయ్యి టి.ఆర్.పీ లు భీకరంగా రానున్నాయని సమాచారం
ప్రస్తుతం నాగార్జున మంచి పీరియడ్ ని ఆనందిస్తున్నాడు మనం సినిమా విజయం తరువాత మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా నాగ్ మనతో కొన్నాళ్ళు ముచ్చటిస్తాడు అన్నమాట

