పాచ్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్న ‘అంజాన్’ టీం

పాచ్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్న ‘అంజాన్’ టీం

Published on Jun 17, 2014 5:38 PM IST

anjana
తమిళ స్టార్ హీరో సూర్య, సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘అంజాన్’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోవాలో తాజా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ముంబై కి వెళ్ళింది. అక్కడ సినిమాలో మిగిలి ఉన్న కొన్ని పాచ్ వర్క్ సీన్స్ ని షూట్ చేయనున్నారు. మరో వారం రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి ఈ చిత్ర డైరెక్టర్ లింగుస్వామి ప్లాన్ చేస్తున్నాడు. యువన్ శకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాని తెలుగు అనువాద హక్కులను లగడపాటి శ్రీధర్ ఓ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు.

తాజా వార్తలు