
హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాని చూసారు. చూసిన తర్వాత ఆయన ఇలాంటి మంచి సినిమాని అందించినందుకు ఈ చిత్ర టీంని ప్రశంశల జల్లులో ముంచెత్తారు. అలాగే మాట్లాడుతూ ”ఊహలు గుసగుసలాడే’ యూత్ మరియు ఫ్యామిలీ ప్రేక్షకులు కలిసి చూడదగిన సినిమా. ముఖ్యంగా సినిమాలో జీరో వల్గారిటీ ఉండేలా ఈ సినిమాని తీసినందుకు సాయి కొర్రపాటికి అభినందనలు తెలిపారు’
నందమూరి బాలకృష్ణ ఈ సినిమా చూసి ఈ చిత్ర టీం అందరినీ అభినందించడంతో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే సాయి కొర్రపాటి బాలకృష్ణ గారు బిజీగా ఉండి కూడా సమయం కేటాయించి ఈ సినిమా చూసినందుకు ఆయనకీ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగ శౌర్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

