
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గోపాల గోపాల’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్. ఇందులో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. హిందీలో అక్షయ్ కోసం ఓ స్పెషల్ బైక్ ని తయారు చేసారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం కూడా ఓ స్పెషల్ బైక్ ని సిద్దం చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తన ఇంట్రడక్షన్ సీన్ లో హ్యోసుంగ్ జివి 650 అక్విల ప్రో బైక్ ని ఉపయోగించనున్నాడు. ఇప్పటికే పవన్ ఈ బైక్ ని 6.6 లక్షలకి కొనుక్కున్నాడు. దీనివల్ల నిర్మాతలకి కాస్త మనీ సేవ్ అయ్యింది. ఎందుకంటే ఈ బైక్ ని రెంట్ కి తీసుకోవాలంటే బాగా ఎక్కువ మనీ అయ్యి ఉండేది.
వెంకటేష్, శ్రియ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. శరత్ మరార్ – సురేష్ బాబు కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

