‘గాయపడ్డ సింహం’ సీక్వెల్ ఖాయం.. కానీ..!

‘గాయపడ్డ సింహం’ సీక్వెల్ ఖాయం.. కానీ..!

Published on Apr 21, 2026 2:00 AM IST

Gaayapadda-Simham-1

దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘గాయపడ్డ సింహం’ చిత్రం మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. కశ్యప్ దర్శకత్వంలో, పవన్ సాధినేని నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి ‘ధర్మ’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మే 1న బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం.

అయితే, ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతోందని, దానికి సంబంధించిన హింట్ క్లైమాక్స్‌లో ఉంటుందని సమాచారం. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే, సీక్వెల్‌లో తరుణ్ భాస్కర్ ఉండరని, ఆయన స్థానంలో మరో హీరో కనిపిస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం ‘గాయపడ్డ సింహం’లో ఒక యంగ్ హీరో అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఆ సీక్రెట్ హీరోనే సీక్వెల్‌లో లీడ్ రోల్ చేయబోతున్నాడట. త్వరలో విడుదల కానున్న ట్రైలర్‌లో ఆ గెస్ట్ హీరో ఎవరో రివీల్ చేసే అవకాశం ఉంది. ఆ హీరో పేరు తెలిస్తే సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఆ సస్పెన్స్ హీరో ఎవరో తెలియాలంటే మే 1 వరకు వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు