అన్నపూర్ణ స్టూడియోస్ లో రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం

అన్నపూర్ణ స్టూడియోస్ లో రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం

Published on Jun 25, 2014 2:04 AM IST

bahubali-first-look
అన్నపూర్ణ స్టూడియోస్ లో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. ఈ షూటింగ్ లో ప్రభాస్, తమన్నా, అనుష్క మరియు రానా పాల్గుంటున్నారు. సినిమాకు సంబందించిన ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఈ సినిమాను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించిన విషయం తెలిసినదే

ఈ సినిమా ఏప్రిల్ 17, 2015 న విడుదల కానుంది. ప్రభాస్ ఒక పోరాటయోధునిగా, రానా అతని తమున్ని స్థానంలో విలన్ గా కనిపించనున్నారు. సత్యరాజ్, నాజర్ మరియు రమ్యకృష్ణలు ముఖ్యపాత్రలు పోషించనున్నారు

కీరవాణి సంగీత దర్శకుడు. ఇప్పటికే కొన్ని పాటలను కంపోజ్ చేసారు. రమారాజమౌళి కాస్ట్యుం డిజైనర్. రాజమౌళి స్వయంగా గ్రాఫిక్స్ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆర్కా మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది

తాజా వార్తలు