‘దృశ్యం’ ఫెయిల్ అయ్యే చాన్సే లేదు – నదియా

‘దృశ్యం’ ఫెయిల్ అయ్యే చాన్సే లేదు – నదియా

Published on Jun 25, 2014 4:44 PM IST

Nadhiya

‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ కి అమ్మగా, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న నటి నదియా. ప్రస్తుతం నదియా విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘దృశ్యం’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అంతే కాకుండా నదియా దృశ్యం సినిమా ఫెయిల్ అయ్యే చాన్సే లేదని, కచ్చితంగా హిట్ అవుతుందని జోశ్యం కూడా చెబుతోంది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ఒక సినిమా సక్సెస్ అనేది మూవీ కంటెంట్ మరియు నటీనటుల పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగానీ ఆ సినిమాకి డైరెక్టర్ మగ లేదా ఆడ అనేదాని మీద ఆధారపడి ఉండదు. దృశ్యం కి సూపర్బ్ స్క్రిప్ట్ కుదిరింది. కావున సినిమా ఫెయిల్ అయ్యే చాన్సే లేదని’ నదియా తెలిపింది.

అలాగే ఈ మూవీ డైరెక్టర్ శ్రీప్రియ రాజ్ కుమార్ ‘ఈ సినిమా లేడీ డైరెక్టర్ కి చాన్స్ ఇవ్వాలని తీసింది కాదు కానీ ఈ సినిమా విజయం మాత్రం ఆ విషయాన్ని హైలైట్ చేస్తుంది. దానివల్ల సినిమాలు చేయాలనుకునే చాలా మంది లేడీ డైరెక్టర్స్ ని ప్రోత్సాహం లభిస్తుందని’ తెలిపింది. మీన, కృతిక జయకుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు