
‘ప్రేమ్ ఇష్క్ కాదల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ పవన్ సాధినేని. తన తదుపరి సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం ప్రకారం పవన్ సాధినేని నారా రోహిత్ తో ఓ సినిమా చేయదానికిం సిద్దమవుతున్నాడు.
పవన్ సాధినేని నారా రోహిత్ కి కథ చెప్పడం, దానికి నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఓ కొత్త నిర్మాత ఈ సినిమాని నిర్మించనున్నాడు. ప్రస్తుతానికి నారా రోహిత్ సరసన నిత్యా మీనన్ ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు. శ్రవణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా, కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్న ఈ సినిమా ఆగష్టులో సెట్స్ పైకి వెళ్లనుంది. మిగిలిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

