
‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్’ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకి పరిచయమై ‘హైవే’, ‘2 స్టేట్స్’ సినిమాతో ఇండియా కుర్రకారు మనసుని కొల్లగొట్టిన భామఅ అలియా భట్. వరుణ్ ధావన్, అలియా భట్ కలిసి నటించిన ‘హంప్టీ శర్మకి దుల్హనియా’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కారణంగా
వీరిద్దరూ హైదరాబాద్ వచ్చారు.
ఈ రోజు జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో ఓ మీడియా పర్సన్ మీకు టాలీవుడ్ లో నటించాలని ఉందా అని అడిగితే ‘నాకు తెలుగు సినిమాలో చేయాలని ఉంది. హైదరాబాద్ లో నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. తనే నేను ఎన్.టి.ఆర్ కి జోడీగా పర్ఫెక్ట్ గా సరిపోతానని అన్నాడు. నేను తెలుగులో సినిమా చేస్తే అది కచ్చితంగా ఎన్.టి.ఆర్ తోనే ఉంటుందని’ తెలిపింది.

