దేవకట్టాని ప్రశంశించిన రాజమౌళి

దేవకట్టాని ప్రశంశించిన రాజమౌళి

Published on Jun 30, 2014 8:00 AM IST

devakatta_rajamouli
దేవకట్టా దర్శకత్వం వహించిన ‘ఆటోనగర్ సూర్య’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా చూసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దేవకట్టాని ప్రశంసించాడు. ‘ఒక యూనియన్ కోసం ఒంటరిగా పోరాడే ఒక వ్యక్తి కథని దేవకట్టా చాలా బాగా తీసాడు. డైలాగ్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్. సమంత చెప్పే ‘పిల్లలు మాత్రం వాడి పోలికలతో పుడతారు’ సీన్ నా ఫేవరేట్. ఈ సినిమాకి ట్రిమ్మింగ్ అవసరం, ఆ ట్రిమ్మింగ్ తొందరగా చేయడం వల్ల సినిమాకి మంచిదైందని’ ట్వీట్ చేసాడు.

ట్రిమ్ చేసిన తర్వాత ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగ చైతన్య పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి హైలైట్ అయితే సమంత గ్లామరస్ గా ఆకట్టుకుంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు