
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కాస్త కూడా గ్యాప్ లేకుండా ‘లింగా’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజే ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రజినీ రెండు వైవిధ్యభరిత పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో వచ్చే ప్రస్తుత ఎపిసోడ్ లో రజినీ కలెక్టర్ గా కనిపిస్తే, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర వైవిధ్యంగా ఉండనుంది. ఈ పాత్రకి సంబందించిన వివరాలను ఈ చిత్ర టీం గోప్యంగా ఉంచుతున్నారు.
జగపతి బాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ లో జగపతి బాబు – రజినీకాంత్ లపై కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. రజినీ కాంత్ సరసన సౌత్ ఇండియన్ బ్యూటీ అనుష్క, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

