మ్యాచో స్టార్ గోపీచంద్ మరియు సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ హిస్టారికల్ డ్రామా గోపీచంద్ 33 టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘భరతవర్ష’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం, అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
క్రీస్తుశకం 642 వ సంవత్సరంలో, ‘శూల’ అనే ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో గోపీచంద్ ఒక పవర్‌ఫుల్ యోధుడిగా సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. గ్లింప్స్‌లో చూపించిన భారీ యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్ ప్రాచీన భారతదేశపు వైభవాన్ని మరియు పరాక్రమాన్ని కళ్లకు కట్టాయి. గోపీచంద్ మేకోవర్, ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు సరికొత్త ఇంటెన్సిటీని తీసుకొచ్చాయి. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తనదైన శైలిలో ఈ హిస్టారికల్ గాథను వెండితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరిస్తున్నాడు.
టెక్నికల్‌గా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ మరియు చిన్నా ప్రొడక్షన్ డిజైన్ ఈ పీరియడ్ డ్రామాకు ప్రాణం పోయగా, అనుదీప్ దేవ్ అందించిన బీజీఎం గ్లింప్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. మరి ఈ ‘భరతవర్ష’ సినిమాతో గోపీచంద్ ఈసారి హిట్టు కొట్టినట్లేనా.. అనే టాక్ ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


