సింగర్ కాబోయి యాక్టర్ అయ్యాను – నందు.

సింగర్ కాబోయి యాక్టర్ అయ్యాను – నందు.

Published on Jul 5, 2014 5:50 PM IST

nandhu
‘100% లవ్’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలతో నటుడిగా తనను ప్రూవ్ చేసుకున్నాడు నందు. ముఖ్యంగా ‘ఆటో నగర్ సూర్య’ సినిమాలో కిచ్చా పాత్రలో నందు నటనకు పలువురు సినిమా ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా ప్రసంశల జల్లు కురిపించారు. నందులో నటనతో పాటు మరో కళ కూడా ఉందండోయ్. భార్య గీతా మాధురి తరహాలో ఈ యువ నటుడు కూడా సింగర్ అట.

నటుడు కాకముందు సింగర్ కావాలని అనుకునేవాడిని. ఇంగ్లీష్ రాప్ రాయగల సామర్ధ్యం ఉంది. బాగా పాడగలను కూడా. తర్వాత నటనపై ఆసక్తి పెరగడంతో యాక్టింగ్ వైపు మొగ్గు చూపాను. అని తెలిపాడు. ప్రస్తుతం గీతా మాధురి తెలుగులో టాప్ సింగర్లలో ఒకరు. నందు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మన సంగీత దర్శకులు ఊరుకుంటారా..? చెప్పండి. ఆలస్యం చేయకుండా వీరిద్దరి చేత ఒక పాట పాడించేయడం త్వరలోనే జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు