
లక్ష్మీ మంచు ప్రస్తుతం ఓ మదర్ గా చాలా ఆనందంగా ఉంది. లక్ష్మీ మంచు తన కుమార్తెకి విద్య నిర్వాణ మంచు ఆనంద్ అని పేరు పెట్టింది.అలాగే విద్యకి సంబందించిన ఫోటోలను ఈ రోజు రిలీజ్ చేసింది. ఆమె మీడియాకి రిలీజ్ చేసిన కొన్ని ఫొటోస్ లో ఏంజెల్ కాస్ట్యూమ్స్ లో ముస్తాబు చేసిన ఆ చిన్నారి పాప ఫోటోలు ఉన్నాయి.
లక్ష్మీ మంచు, ఆమె భర్త ఆనంద్ సురోగసీ మెథడ్ ద్వారా తల్లి తండ్రులయ్యారు. విద్య జూన్ 15న జన్మించింది. మీకు అందించిన ఫోటోలు అధికారికంగా మొదటిసారి రిలీజ్ చేసిన ఫోటోలు. లక్ష్మీ మంచు ఓపెన్ గా సురోగసీ ద్వారా తల్లి అయ్యానని డిక్లేర్ చేయడం వల్ల మహిళలు ఆమెను మరింత ప్రశంసిస్తున్నారు. అలాగే ఈ సురోగసీ ప్రాసెస్ గురించి మరింత అవేర్నెస్ వస్తుందని వారు భావిస్తున్నారు.
లక్ష్మీ మంచు కుమార్తె విద్య నిర్వాణ మంచు ఆనంద్ ఫోటోల కోసం – ఇక్కడ క్లిక్ చేయండి

